Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మొక్కేందుకు వెళ్తే జీవీఎల్ ను కాలితో తన్నిన ఆవు

Cow hits GVL Narasimha Rao with back leg
Advertisement
  • గుంటూరులో మిర్చి ఎగుమతిదారుల అసోసియేషన్ ఆఫీస్ ఓపెనింగ్ కు వచ్చిన జీవీఎల్
  • ఆవును తీసుకొచ్చిన అసోసియేషన్ సభ్యులు
  • మొక్కేందుకు వెళ్లగా వెనుక కాలితో తన్నిన ఆవు
Advertisement
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుకు ఒక ఊహించని అనుభవం ఎదురైంది. ఒక ఆవుకు నమస్కరించేందుకు వెళ్లగా అది ఆయనను వెనుక కాలితో తన్నింది. వివరాల్లోకి వెళ్తే గుంటూరులో మిర్చి ఎగుమతిదారుల అసోసియేషన్ కార్యాలయం ఈరోజు ప్రారంభమైంది. ఈ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు జీవీఎల్ వచ్చారు. 

కార్యాలయం ప్రారంభోత్సవం కోసం అసోసియేషన్ వారు ఒక ఆవును తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆవుకు నమస్కరించేందుకు వెళ్లగా అది ఆయనను తన్నింది. అయితే పెద్దగా దెబ్బ ఏమీ తగల్లేదు. మరోసారి మొక్కేందుకు ప్రయత్నించగా అది మరోసారి కాలు లేపింది. దీంతో, అక్కడున్న వారు ఆయనను పక్కకు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. 
Advertisement
Advertisement
GVL Narasimha Rao
BJP
cow

More Telugu News